Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైవిధ్యమైన చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన కథానాయకుడు శ్రీవిష్ణు. ఆయన నటించిన 'అర్జున ఫల్గుణ' చిత్రం శుక్రవారం విడుదలై, విశేష ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో విభిన్న కథా చిత్రంలో నటించటానికి గ్రీన్‌సిగల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని టింబు ప్రొడక్షన్స్ పతాకంపై వేదరాజ్ టింబర్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత వేదరాజ్ టింబర్ మాట్లాడుతూ, 'శ్రీ విష్ణు హీరోగా మా సంస్థలో ప్రొడక్షన్నెం.4గా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. గతంలో మా సంస్థలో అల్లరి నరేష్ హీరోగా 'మడతకాజా', 'సంఘర్షణ' చిత్రాల్ని నిర్మించాం. త్వరలోనే తాజా సినిమా విశేషాలను తెలియజేస్తాం' అని చెప్పారు.