Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్పై తెరకెక్కుతున్న చిత్రం 'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్.కె.చంద్ర దర్శకుడు.
'లాలా భీమ్లా.. అడవి పులి' అంటూ దర్శక, రచయిత త్రివిక్రమ్ రాసిన ఈ పాట గత నెలలో విడుదలై, విశేష ఆదరణ పొందిన విషయం విదితమే. అభిమానులకు, ప్రేక్షకులకు నూతన సంవత్సర కానుకగా ఈ పాటను డీజే వర్షెన్‌లో చిత్ర బృందం శుక్రవారం రిలీజ్ చేసింది.
'2021కి వీడ్కోలు చెబుతూ, నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ విడుదల చేసిన ఈ పాట అభిమానుల ఆనందోత్సాహాలను మరోమారు అంబ రాన్ని తాకేలా చేసింది. 'భీమ్లా నాయక్' పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ పాట వస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం మరింత ఊపు వచ్చేలా చేశాయి. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. నిత్యామీనన్, సంయుక్త మీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి పి.డి.వి.ప్రసాద్ సమర్పకులు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న వరల్డ్‌వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.