Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, నాగచైతన్య, రమ్యకష్ణ, కతిశెట్టి కాంబినేషన్లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బంగార్రాజు'. షూటింగ్ పూర్తయ్యింది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ప్రమోషన్స్‌లో భాగంగా నూతన సంవత్సరం కానుకగా నేడు (శనివారం) ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా, సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.