Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబి నేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్' (సాలా క్రాస్ బ్రీడ్). ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ శుక్రవారం విడుదలయ్యింది.
ట్రెమండస్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న దీని గురించి చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఈ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ మెకోవర్, యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నారు. ఆయన్ని స్లమ్ డాగ్‌గా, ముంబై వీధుల్లో ఛారు వాలా నుంచి అంతర్జాతీయ బాక్సర్‌గా ఎదిగినట్లు దర్శకుడు పూరి జగన్నాధ్ చూపించారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. 'వీ ఆర్ ఇండియన్స్' అంటూ దేశభక్తిని పెంపొందించేలా విజయ్ దేవరకొండ తన వాయిస్‌ని ఆయన గట్టిగా వినిపించారు. చివర్లో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చే తీరు కూడా అద్భుతంగా ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది' అని తెలిపింది.
ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అమ్మగా రమ్యకష్ణ కనిపించనుండగా, రోనిత్ రారు గురువుగా మెరవబోతున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 25న విడుదల కాబోయే ఈ చిత్రంలో విజరుదేవరకొండ సరసన అనన్యపాండే నాయికగా నటిస్తున్నారు.