Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్‌బాబు, మోహనకష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రాబోతున్న మూడవ చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. న్యూ ఇయర్ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్ లాంచ్ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ, 'ఇంద్రగంటి గారు విభిన్నమైన చిత్రాలు చేయగల దర్శకులు. ఆయనతో ఈ సినిమా చేస్తున్నందుకు, అలాగే హీరో సుధీర్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్‌లో సినిమా చేయాలని వెయిట్ చేశాం. అది ఇప్పటికి నెరవేరటం హ్యాపీగా ఉంది' అని చెప్పారు.
'ఈ కథను ఇంద్రగంటిగారు మాకు చెప్పగానే ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందనిపించింది' అని మైత్రీ మూవీ మేకర్స్ సీయీవో చెర్రి అన్నారు. 'ఒక అమ్మాయి, ఒక అబ్బాయి లైఫ్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది?, అనూహ్యంగా వీళ్లు ఎలా ప్రేమలో పడ్డారు?, ఆ ప్రేమకు ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి?, వాటిని అధిగమించి ప్రేమతో పాటు వాళ్లు అనుకున్నది సాధించారు అనేది ఈ చిత్ర కథ. మైత్రీ మూవీ మేకర్స్ ప్రెజెంటర్‌గా ఉండటం అనేది సినిమా బాగుందనే స్టాంప్ వేసినట్లే' అని దర్శకుడు ఇంద్రగంటి అన్నారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో సినిమా డైరెక్టర్‌గా నటిస్తున్నాను. ఇదొక కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈ చిత్రానికి మైత్రీ మూవీస్ అసోసియేట్ అవడం ఇంధనం లాంటిది' అని చెప్పారు. హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ, 'సినిమా అంతా మన ఇరుగు పొరుగు ఇంట్లో జరిగినంత సహజంగా ఉంటుంది' అని తెలిపారు.