Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'డిజె టిల్లు'. ఈ సినిమా ఈనెల 14న విడుదల అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని కూడా శనివారం విడుదల చేసింది. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే రీతిలో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. ఇటీవల విడుదల అయిన టీజర్ కూడా యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసింది. నూతన దర్శకుడు విమల్ కష్ణ దర్శకత్వంలో కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రచన: విమల్ కష్ణ, సిద్దు జొన్నలగడ్డ, మాటలు: సిద్దు జొన్నలగడ్డ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ.