Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మిస్టర్ అండ్ మిస్' ఫేమ్ అశోక్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'మహానటులు'.
ఏబీఆర్ ప్రొడక్షన్స్, ఏబీఆర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ బొడ్డిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్.యర్రంరెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర పోస్టర్ లాంచ్, క్యారెక్టర్ రివీల్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ''ఓ స్త్రీ రేపు రా' షార్ట్ ఫిలింతోనే అశోక్ టాలెంట్ అందరికీ తెలిసింది. అశోక్‌తో సినిమా చేసినందుకు ప్రొడ్యూసర్‌కు థ్యాంక్స్ చెబుతున్నా. అశోక్ కచ్చితంగా పెద్ద దర్శకుడు అవుతాడు' అని తెలిపారు.
'టైటిల్ పెట్టినట్లు ఈ సినిమాలో అంతా మహానటులే. జాతిరత్నాలు జోనర్లో సినిమా ఉంటుంది. నేను ఇప్పటిదాకా కామెడీ జోనర్ టచ్ చేయలేదు. సినిమా చేస్తున్నప్పుడు నేనూ ఎంజారు చేశాను. మన చూట్టూ ఉండే ఓ నాలుగు క్యారెక్టర్స్ ఈ కథలో ఉంటారు. ఈ నలుగురు కలిసి మహానటులు అనే యూట్యూబ్ ఛానెల్‌ను ఎలా డెవలప్ చేశారు అనేది కథ. ప్రేక్షకులూ ఈ సినిమాని ఎంజారు చేస్తారని నమ్మకంగా చెప్పగలను' అని దర్శకుడు అశోక్ కుమార్ చెప్పారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ మాట్లాడుతూ, 'నిర్మాతలు క్వాలిటీలో రాజీ పడకుండా నిర్మించారు. దర్శకుడు ఎలాంటి కథను చెప్పాలనుకున్నాడో అది అనుకున్నట్లే తెరపైకి వచ్చింది' అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో ఎమ్మెల్యే సీతక్క బయోపిక్ కూడా చేయబోతున్నాం' అని చెప్పారు.