Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటిస్తున్న నయా సినిమా 'అంటే సుందరానికీ'. వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీస్ సంస్థపై నవీన్ యేర్నేని, రవి శంకర్ వై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రం నుంచి జిరోత్ లుక్ పోస్టర్, వీడియోను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో డిఫరెంట్ గెటప్‌లో కొత్తగా కనిపిస్తున్నారు.
ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా ఉంటుందని వీడియో ద్వారా అర్థమవుతోంది. నానికి ఈ సినిమా తప్పకుండా మరో డిఫరెంట్ మూవీ కానుంది. ఆవకాయ సీజన్లో అంటే సమ్మర్లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోందని కూడా ఈ వీడియో మేకర్స్ ప్రకటించారు. నానికి జోడీగా నటిస్తూ ఈ చిత్రంతో తెలుగు తెరకు నజ్రియా నజిమ్ ఫహాద్ పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం - వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ- నికేత్ బొమ్మి, ఎడిటర్ - రవితేజ గిరిజాల.