Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాష చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, పూస్కుర్ రామ్మోహన్ రావు, సురేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. శివ కార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై తెరకెక్కించబోతున్నారు. 'జాతి రత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దర్శకుడు అనుదీప్ కేవి రూపొందిస్తున్న చిత్రమిది.
నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటిస్తూ, మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్‌కు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది.
లండన్‌తో మన దేశంలోని పాండిచ్చేరి నేపథ్యంగా కథ సాగనుంది. కంప్లీట్ ఎంటర్టైనర్గా ఉండబోతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.