Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'భోళా శంకర్'. మేహర్ రమేష్ దర్శకుడు. న్యూ ఇయర్ సందర్భంగా శనివారం 'స్వాగ్ ఆఫ్ భోళా' పేరుతో ఈ సినిమాలోని ప్రీ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'స్వాగ్ ఆఫ్ భోళా'లో పూర్తి మాస్ లుక్‌లో ఉన్న మెగాస్టార్ స్టైలిష్ మేకోవర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌కి ఇదొక పెద్ద గిఫ్ట్. 'స్వాగ్ ఆఫ్ భోళా'తో పాటు సినిమా థీమ్ మ్యూజిక్‌తో విడుదల చేసిన మోషన్ వీడియో కూడా విశేషంగా అలరిస్తోంది.
చిరు సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఇందులో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ - డూడ్లే, స్టోరీ సూపర్ విజన్ - సత్యానంద్, ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్ - ఏఎస్ ప్రకాష్, మాటలు - తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్ - రామ్ లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కియోచి కంపాక్డీ, కొరియోగ్రఫీ - శేఖర్ మాస్టర్, సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యాం, శ్రీమణి, సిరాశ్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కిషోర్ గరికపాటి.