Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటించిన చిత్రం 'ఇందువదన'. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం.ఎస్.ఆర్. (ఎం.శ్రీనివాసరాజు) దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మించారు. నూతన సంవత్సరం కానుకగా ఈ సినిమా విడుదలై, మంచి ఆదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, 'కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ నేను నటించిన చిత్రమిది. ఈ సినిమాలోని కంటెంట్ అందరికీ బాగా కనెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. న్యూఇయర్‌కి విడుదలైన మా చిత్రాన్ని అందరూ బాగా ఆదరిస్తున్నారనే రిపోర్టులు వస్తున్నాయి. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు, అలాగే మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని తెలిపారు.