Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ చేశారు.
'గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికర కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రేక్షకులు థ్రిల్ అయ్యే అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. తాజాగా విడుదల చేసిన టీజర్ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించింది. ఈ సినిమాతో విలన్‌గా పరిచయమవుతున్న సహజనటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ రోల్ సినిమాకు మేజర్ అసెట్ అవుతుంది. ప్రతీ సీన్ విజువల్ ట్రీట్‌గా ఉన్నాయి. సాయిు కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేయడంలో కీలక భూమిక పోషించింది' అని దర్శక, నిర్మాతలు చెప్పారు.