Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయి కుమార్, నువేక్ష జంటగా నటించిన చిత్రం 'అతిథి దేవో భవ'. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మించారు. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు.
విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి మీడియా సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ, 'ఈనెల 7న మా సినిమా రాబోతుంది. మంచి సినిమాకి మంచి స్పాన్ ఉన్న సినిమా. కొత్తగా ఉంటుంది. పాత్రలన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. శేఖర్ చంద్ర చక్కటి బాణీలు సమకూర్చారు. సినిమా బాగా వచ్చింది' అని తెలిపారు.
'ఇప్పటికే మా సినిమాలోని పాటలు ఆదరణ పొందాయి. ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఆది కెరీర్లోనే భిన్నమైన జోనర్ ఇది' అని దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ చెప్పారు.
నిర్మాతలు రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల మాట్లాడుతూ, 'ఈ సినిమాలో ఆది సాయికుమార్‌ను భిన్నమైన కోణంలో చూస్తారు. అందరి సహకారంతో చిత్రాన్ని అనుకున్నట్లు పూర్తి చేశాం. ఈనెల 7న విడుదల చేస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అని అన్నారు.