Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూలై 4న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరపబోయే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి జాతీయ వేడుకల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నటించి, నిర్మించిన నటశేఖర కష్ణని సన్మానించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, 'ఆజాదీ కా అమత్ మహౌత్సవ్‌లో భాగంగా ఈ వేడుకని ఆరంభిస్తున్నాం. బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన లేకపోతే మనలో ఆ తెగింపు రాదు. దేశం కోసం పోరాటం చేసిన తెలుగు వ్యక్తి అల్లూరి' అని చెప్పారు. 'హీరో అయ్యాక ఎన్నో చిత్రాలు చేశా. కానీ ఒక గొప్ప చిత్రం తీయాలనే కోరిక ఉండేది. నా 100వ చిత్రం 'అల్లూరి సీతారామరాజు' ఎంచుకుని, నేనే నిర్మించాను. ఆ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నేను 365 సినిమాల్లో నటించినప్పటికీ నా ఉత్తమ చిత్రం ఎప్పటికీ అల్లూరి సీతారామరాజే. ఏడాది పాటు ఆ చిత్రం ప్రేక్షకులను అలరించింది' అని కృష్ణ చెెప్పారు.