Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం 'రావణాసుర'. ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈనెల 14న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. శ్రీకాంత్ విస్సా పవర్ ఫుల్ స్టోరీ అందించారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో దర్శకుడు సుధీర్‌వర్మ చూపించనున్నారు. పది డిఫరెంట్ గెటప్స్‌లో ఉన్న కథానాయకుడి ఫస్ట్‌లుక్ అందర్నీ విశేషంగా అలరించింది. లాయర్‌గా రవితేజ వెండితెరపై మెరవబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.