Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో తనదైన ముద్రను సొంతం చేసుకున్న ఎస్ ఒరిజినల్స్ ఈ కొత్త సంవత్సరంలో ఏకంగా 9 సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు రంగం సిద్ధం చేసింది.
ఈ సందర్భంగా ఎస్ ఒరిజినల్స్ సంస్థ అధినేత సజన్ యరబోలు మాట్లాడుతూ, 'ఎస్ ఒరిజినల్స్‌ను టాలీవుడ్లో ప్రత్యేక స్థానంలో నిలపాలన్నదే నా కోరిక. బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న 'పంచతంత్రం', సంతోష్ శోభన్ హీరోగా, నూతన దర్శకుడు సుుభాష్ దర్శకత్వంలో ఓ అందమైన ప్రేమకథను తెరకెక్కించాం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది. అలాగే ఒక కొత్త కాన్సెప్ట్‌తో సుమంత్ హీరోగా రూపొందు తున్న 'అహం' సినిమాకి సంబంధించి ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. కొత్త దర్శకుడు బ్రిజేష్ దర్శకత్వంలో 'వైరల్', బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా చేస్తున్న సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'గతం' ఫేమ్ కిరణ్ దర్శకత్వంలో అదే టీంతో మరో సినిమా చేస్తున్నాం. వీటితో పాటు కన్నడంలో బీర్బల్ ట్రియాలజీ తీసిన దర్శకుడు శ్రీని దర్శకత్వంలో 'ఓల్డ్ మంక్' చిత్రాన్ని, కొత్త దర్శకుడు విష్ణు దర్శత్వంలో మళయాళంలో రూపొందుతున్న 'నైనా'. ఇందులో '96' మూవీ ఫేమ్ గౌరి కిషన్ లీడ్ రోల్ చేస్తుంది. అలాగే బాలీవుడ్ పాపులర్ రైటర్స్ సిద్దార్ధ, గరీమ దర్శకత్వంలో రూపొందున్న 'దుకాన్' సినిమా చిత్రీకరణ ఆఖరి షెడ్యూల్లో ఉంది. ఈ సినిమాలతో ఈ సంవత్సరం ఎస్ ఒరిజనల్స్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది' అని తెలిపారు.