Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి (పి.సి.రెడ్డి, 86) సోమవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 80కి పైగా భిన్న జోనర్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కష్ణ, శోభన్‌బాబు వంటి తదితర హేమాహేమీలతో ఆయన సినిమాలు తీశారు. కెరీర్లో ఎక్కువగా కష్ణ చిత్రాలకు దర్శకత్వం వహించటం విశేషం. 'భలే అల్లుడు', 'మానవుడు దానవుడు', 'బడిపంతులు', 'విచిత్ర దాంపత్యం', 'రగిలే గుండెలు', 'నవోదయం', 'పాడిపంటలు', 'బంగారు కాపురం', 'రాజకీయ చదరంగం', 'అన్నా వదిన', 'పెద్దలు మారాలి', 'పట్నవాసం' వంటి తదితర ఆయనకు మంచి గుర్తింపునిచ్చాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమం వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
దర్శకులు పి.చంద్రశేఖర్ రెడ్డి నాకు వ్యక్తిగతంగా, మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆప్తులు. ఆయన దర్శత్వంలో వచ్చిన తొలి, మలి చిత్రాలు 'అత్తలు కోడళ్ళు', 'అనురాధ'లో హీరోగా నటించాను. మా ఇద్దరి కాంబినేషన్లో 23 చిత్రాలు వచ్చాయి. వాటిలో 'ఇల్లు ఇల్లాలు', 'కొత్త కాపురం', 'పాడిపంటలు', 'నా పిలుపే ప్రభంజనం' మంచి హిట్స్. మా పద్మాలయ అనుబంధ సంస్థలో కూడా ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించారు. మాకు చాలా ఆప్తులైన వ్యక్తిని కోల్పోయాం.
- కృష్ణ