Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై షకలక శంకర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'ది బాస్'. నెవర్ డైస్ అనేది ఉపశీర్షిక. ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో నిర్మాత బొమ్మకు మురళి నిర్మిస్తున్నారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ వంటి ఓ అపర మేధావి బాబాగా మారితే అనే ఊహా జనిత కథాంశం ఆధారంగా అత్యంత వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర టైటిల్ లోగోను నటుడు సునీల్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, 'ఈ సినిమా సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుంది. అలాగే రామ్ గోపాల్ వర్మను పోలిన వ్యక్తిగా షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడని ఆశిస్తున్నాను' అని చెప్పారు.
'మా చిత్ర టైటిల్ లోగోను ఆల్రౌండర్ సునీల్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చిత్రీకరణతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం' అని దర్శక, నిర్మాతలు తెలిపారు. డెబోరాఫెల్, సోహైల్, రాజశ్రీ, సన, హర్షవర్ధన్, పోసాని, సూపర్ ఉమన్ లిరిష, పటాస్ ప్రవీణ్, జబర్దస్త్ మురళి, చిట్టిబాబు, పంచ్ ప్రసాద్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.