Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం 'సార్' (తమిళంలో 'వాతి'). నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతత్వంలోని సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సోమవారం రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల సమక్షంలో వైభవంగా జరిగింది. 'రంగ్‌దే' డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
నాయకానాయికలు ధనుష్, సంయుక్త మీనన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సురేష్ చుక్కపల్లి, నిర్మాత డా.కె.ఎల్.నారాయణ కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు. నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి, ప్రగతి ప్రింటర్స్ అధినేత మహేంద్ర తదితరులు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందచేశారు.
ఈనెల 5 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని, 'యాన్ యాంబిషియస్ జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్' స్లోగన్‌తో ఇటీవల విడుదల చేసిన టైటిల్ రివీల్ వీడియో ఒక ఉద్వేగభరితమైన, ఉత్తేజకరమైన కథతో రాబోతున్నారని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగించిందని నిర్మాతలు తెలిపారు.