Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయి కుమార్, నువేక్ష జంటగా నటించిన చిత్రం 'అతిథి దేవోభవ'. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. ఈ చిత్రాన్ని 'అఖండ' చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సోదరులు రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు.
ఈనెల 7న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా సోమవారం నిర్మాత అశోక్ రెడ్డి మిర్యాల మీడియాతో మాట్లాడుతూ, 'వేణుగోపాల్ అందించిన కథకు నేను, మా వదిన స్క్రీన్ ప్లే రాశాం. సంభాషణలు కూడా నేను రాయడానికి చిన్నతనం నుంచి ఉన్న పరిశీలనతోపాటు లెక్చరర్‌గా చేసిన అనుభవం కూడా దోహదపడింది. సినిమాపై మక్కువతోనే లెక్చరర్ ఉద్యోగం వదిలేసి వచ్చాను. సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్‌తోపాటు మంచి సినిమా తీశారని ప్రశంసించడం ఆనందంగా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం, సప్తగిరి, ఇమ్యాన్యుయేల్ ఎంటర్టైన్మెంట్ అందరికీ బాగా నచ్చుతుంది. సీనియర్ నటి రోహిణి తన పాత్రను ఎమోషనల్‌గా బాగా పండించారు' అని తెలిపారు.
'ఒమిక్రాన్ వైరస్‌తో సినిమా పరిశ్రమలో కొంచెం గందరగోళంగా ఉన్నప్పటికీ కథపై ఉన్న నమ్మకంతో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇందులో యూత్‌తోపాటు ఫ్యామిలీ అంశాలున్నాయి. అది సాయికుమార్ కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది. ఈ సినిమా జోనర్ చెప్పాలంటే మొదటి భాగం లవబుల్‌గా, సెకండాఫ్ థ్రిల్లింగ్ ఎమోషన్స్‌తో ఉంటుంది. ట్రైలర్లో చూసినట్లుగా హర్రర్ కథ మాత్రం కాదు. అందర్నీ అలరించే సినిమా ఇది' అని మరో నిర్మాత రాజాబాబు అన్నారు.