Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, రామ్‌చరణ్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ సినిమాలోని 'సానా కష్టం వచ్చేసిందే మందాకిని..' అంటూ సాగే స్పెషల్ సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ఈ పాటలో చిరంజీవి తనదైన మార్క్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆయన డాన్స్ గ్రేస్‌కి, రెజీనా గ్లామర్ తోడయ్యింది. ఈ సాంగ్ థియేటర్స్‌లో మాస్ ఆడియెన్స్, మెగాభిమానులను విశేషంగా అలరిస్తుందని నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.