Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శక, నిర్మాత ఎం.ఎస్.రాజు తెరకెక్కించిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్.రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు.
విడుదలకు సిద్ధమైన ఈచిత్రం గురించి దర్శకుడు ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ, 'నా కెరీర్లో అన్ని జోనర్ చిత్రాలు చేశాను. ఇక కేవలం మసాలా చిత్రాలకి మాత్రమే పరిమితం కాకుండా, ఎవరు చేయనివి చేద్దామనుకుంటు న్నాను. నా 'డర్టీ హరి' పోస్టర్లు చూసి నేనిలా అయిపోయాను అని చెవులు కొరుక్కున్న వారు చిత్రంలోని చివరి 40 నిమిషాలకి ఇచ్చిన స్పందన ఇప్పటికీ గుర్తుంది. అదే పంథాలో నాకు నచ్చేలా, అందరూ మెచ్చేలా ఈసారి ఒక న్యూ జెన్ రోమ్-కామ్ చిత్రంతో అన్ని రకాల ప్రేక్షకులను అలరించబోతున్నాం. బ్యాచిలర్ ట్రిప్ కోసం గోవాకి వెళ్లిన ఇద్దరు యువకులు, ఇద్దరు యువతుల చుట్టూ జరిగే కథ ఇది. క్లాసిక్ చిత్రంగా మారే అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ప్రతీ ఒక్కరు, తమని తాము ఇందులోని పాత్రలకి బాగా రిలేట్ చేసుకుంటారు. సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం' అని అన్నారు.