Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న న్యూఏజ్ లవ్‌స్టోరీ 'బేబీ'. దసరా పండక్కి లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఏకధాటిగా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ చిత్రంతో నాయికగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వైష్ణవి చైతన్య పుట్టినరోజు మంగళవారం. ఈ సందర్భంగా టీమ్ మెంబర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వైష్ణవి చైతన్య స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పొయెటిక్‌గా డిజైన్ చేసిన బర్త్ డే పోస్టర్లో వైష్ణవి చైతన్య చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది.
విజరు దేవరకొండతో 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన ఎస్.కె.ఎన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్కేఎన్, దర్శకుడు మారుతి సంయుక్త సంస్థ మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: సాయి రాజేష్, సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి, సంగీతం: విజరు బుల్గానిన్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: సురేష్, సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్.