Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవాళికి అడవులు ఎంత ముఖ్యమో, ఆ అడవులకు ఏనుగులూ అంతే ముఖ్యం. ఏనుగులకి, అడవులకు ఉన్న బంధాన్ని చెప్పే సినిమా 'అరణ్య'. ప్రకతి విలువేంటో తెలియజెప్పిన ఈ సినిమా జీ తెలుగులో ఈనెల 9 సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించనుంది.
ఈ సందర్భంగా జీ తెలుగు ప్రతినిధులు మాట్లాడుతూ, 'మనిషి తన స్వార్థం కోసం ప్రకతిని నాశనం చేస్తే వచ్చే వినాశనానికి ప్రతిబింబమే ఈ చిత్రం. నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య (రానా) ప్రకతి ప్రేమికుడు. అడవులు, వన్యప్రాణులు అంటే ఆయనకు ప్రాణం. ఫారెస్ట్ మాన్ ఆఫ్ ఇండియా అవార్డుని అందుకున్న ఆయనకు అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత్ మహదేవన్) ఎదురైన సమస్య ఏంటి?, చివరికి ఏం జరిగింది? అనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. వైవిధ్యమైన పాత్రలు, కథా చిత్రాల్లో నటించే అతికొద్ది మంది నటుల్లో రానా ఒకరు. పాత్ర ఏదైనా అందులో పరకాయప్రవేశం చేయడం ఆయన నైజం. ఈ సినిమాతో అది మరోసారి నిరూపితమైంది. చెట్లు, ఏనుగుల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా అరణ్య పాత్రలో రానా పరకాయ ప్రవేశం చేశారు' అని అన్నారు.