Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజిత్ కుమార్ హీరోగా జీ స్టూడియోస్ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకంపై బోనీ కపూర్ నిర్మించిన పాన్ ఇండియా చిత్రం 'వలీమై'. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ,'జనవరి 13న ముందుగా తమిళ వెర్షన్ విడుదల చేద్దామని అనుకున్నాం. అయితే తెలుగునాట సంక్రాంతి పండక్కి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో తెలిసి, ఇదే సరైన సమయమని తమిళంతో పాటు హిందీ, తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేస్తున్నాం. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే గ్రాండ్ విజువల్స్‌తో చిత్రం అద్భుతంగా ఉంటుంది. తెలుగులో 'ఖాకి'గా విడుదలైన కార్తీ తమిళ సినిమా 'థీరన్ అధిగారం ఒండ్రు' సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్.వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. అజిత్ క్రేజ్‌కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఓ పవర్ఫుల్ పోలీస్‌గా అజిత్ కనిపిస్తారు. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటిస్తున్నారు' అని చెప్పారు.