Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయకుడు కష్ణ కుటుంబం నుంచి అశోక్ గల్లా హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి పండక్కి ఈ నెల 15న థియేటర్లలో విడుదల కాబోతోందీ చిత్రం. తాజాగా ఈ సినిమా నుంచి ర్యాప్ సాంగ్ 'డోనల్ డగ్గును' రిలీజ్ చేశారు.
ఈ పాటకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మాట్లాడుతూ, 'టాలెంటెడ్ మ్యుజీషియన్ జిబ్రాన్ జోష్ ఇచ్చిన బీట్తో ఈ ర్యాప్ సాంగ్ కంపోజ్ చేశారు. రోల్ రైడా సాహిత్యాన్ని అందించడంతో పాటు ఎనర్జిటిక్‌గా పాడాడు. 'ఊరు వాడా చూడు ఈడ, అన్న గేమ్ హల్చలుంది..పెంచమంది కిర్రాకునే.. జిల్లా మొత్తం ఊగిపోద్ది గల్లా ఎత్తి ' అంటూ ఫుల్ మాస్ బీట్తో సాగుతుందీ పాట. అశోక్ గల్లాను కంప్లీట్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని ఈ చిత్రంలో చేర్చారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఈ ర్యాప్ సాంగ్‌లో అశోక్ గల్లా డాన్సింగ్ టాలెంట్ ప్రేక్షకులు చూడబోతున్నారు. చిరంజీవి స్టెప్స్, రజినీకాంత్ స్టైల్, బాలకష్ణ ఫెరోషియస్ నటన, వెంకటేష్ క్లాస్ లుక్స్..ఇవన్నీ డోనల్ డగ్గు పాటలో చూపించడం సరికొత్త కాన్సెప్ట్‌గా ఆకట్టుకుంటోంది. ఈనెల 15న ఈ పాట థియేటర్లను ఊపేయడం ఖాయం' అని అన్నారు.