Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం 'రౌడీ బార్సు'. నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ చిత్రం నుంచి 'బందానం నుంచి కష్ణుడు వచ్చాడే..' అనే పాటను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్గా రిలీజ్ అయిన 'బందావనం నుంచి కష్ణుడు వచ్చాడే ..' సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలతో పోలిస్తే ఈ పాట చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. అన్నీ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని యూత్ సహా అందరినీని మెప్పించేలా హిట్ చిత్రాల నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, డైరెక్టర్ శ్రీహర్ష, దేవిశ్రీప్రసాద్, మది టీమ్‌తో రూపొందించారు' అని తెలిపారు.