Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై ఉగ్రదాడి అమరుడు మేజర్ ఉన్నికష్ణన్ జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా 'మేజర్'. ఈ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ పాత్రను అడివి శేష్ పోషిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతోంది. ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ 'హదయమా..'ను ఈ నెల 7న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు.
'శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 'మేజర్' మ్యాజిక్ 'హదయమా..' పాటతో మొదలు కానుంది. ఈ పాటకు వీఎన్వీ రమేష్, కష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, సిధ్ శ్రీరామ్ ఆలపించారు. అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటపై రొమాంటిక్‌గా సాంగ్ చిత్రీకరించారు. ఇటీవలే ఈ సినిమా హిందీ వెర్షన్‌కి హీరో అడివి శేష్ డబ్బింగ్ ప్రారంభించారు. ప్రపంచస్థాయి ఫిల్మ్ మేకింగ్‌తో జాతీయ భావన, దేశభక్తిని కలిగించే ఉద్వేగ సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కింది. హిందీ, తెలుగు, మలయాళంలో ఈ సినిమా విడుదల కానుంది' అని చిత్ర బృందం తెలిపింది.
మహేష్ బాబు ఏఎంబీ ఎంటర్టైన్మెంట్, ఎ+ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.