Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పక్కా మాస్ కమర్షియల్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకష్ణ సరసన శతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజరు ప్రతినాయకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. లేటెస్ట్గా ఇందులో ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ శరత్‌కుమార్‌ని ఎంపిక చేసినట్టు చిత్ర బందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
నటిగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌కి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'క్రాక్' చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో పోషించిన జయమ్మ పాత్ర అందర్నీ విశేషంగా అలరించింది. దీంతో టాలీవుడ్లో పవర్ఫుల్ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మరోసారి ఈ చిత్రంలోని పవర్ఫుల్ పాత్రలో వరలక్ష్మీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తుండగా, రిషీ పంజాబీ సినిమాటోగ్రఫి, నవీన్ నూలీ ఎడిటింగ్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ సమకూరుస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలను మేకర్స్ ప్రకటిస్తారు.