Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'అతిథి దేవోభవ' చిత్రం ఈ నెల7న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్‌పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించిన ఇందులో నువేక్ష కథానాయిక. బుధవారం హీరో ఆదిసాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ, 'ఇందులో నా నటన అందరికీ నచ్చుతుంది. ఇలాంటి పాత్ర ఇంతవరకు చేయలేదు. స్క్రిప్ట్‌లో అంతర్లీనంగా ఓ భావోద్వేగ అంశం ఉంది. ఈ సినిమా ఎగ్జిక్యూషన్ పార్ట్‌ని దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా ఫలితంపై నాకు మంచి నమ్మకం ఉంది. పాటలు కూడా సినిమాలో బాగా వర్కవుట్ అవుతాయి. శేఖర్ చంద్ర పాటలు, బిజీఎమ్ చాలా బాగా వచ్చాయి. కరోనా కారణంగా మా నిర్మాతలు ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సంకల్పించారు. అందుకే ఈ నెల7న మా చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. దీనికి రాబోయే శనివారం రెండో శనివారం కావడంతో వారాంతంలో కలెక్షన్లు పెరుగుతాయని ఆశిస్తున్నాను.
ఇకపై నా సినిమాలన్ని డిఫరెంట్ జోనర్స్లోనే ఉంటాయి. ప్రస్తుతం నటిస్తున్న 'తీస్ మార్ ఖాన్' పూర్తి కమర్షియల్ సినిమా. అలాగే వీఎఫ్ఎక్స్కి మంచి ప్రాధాన్యత ఉన్న 'అమరన్ ఇన్ ది సిటీ' అనే ఫ్రాంచైజీ సినిమా చేస్తున్నాను. అవికా గోర్ కూడా నటిస్తున్న కంటెంట్ ఆధారిత సినిమా ఇది. 'బ్లాక్' ఒక థ్రిల్లర్, దీని షూటింగ్ పూర్తయింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'సిఎస్ఐ సనాతన్' చిత్రీకరణ మరో 10 రోజుల్లో పూర్తవుతుంది. సంక్రాంతికి కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది రొమాంటిక్ సినిమా. 'జంగిల్' తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. దీని అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది' అని తెలిపారు.