Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తండ్రీతనయులు అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'బంగార్రాజు'. నాగ్ సరసన రమ్యకష్ణ నటిస్తుండగా, చైతూకి జోడీగా కతి శెట్టి మెరవనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ఈనెల 14న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో దర్శకుడు కళ్యాణ్ కష్ణ మాట్లాడుతూ, 'చాలా మంది బిజీ ఆర్టిస్ట్‌లు ఇందులో నటించారు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయి. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాను ఫస్ట్ డే చూసిన వెంటనే సీక్వెల్ చేద్దామని నాగార్జునగారు అన్నారు. అప్పుడు ఆయన అన్న మాటల ఫలితమే ఈ సినిమా. నాగ చైతన్య ఏ సినిమాకి ఆ సినిమాకు కొత్తగా కనిపిస్తారు. కానీ ఇందులో మరింత కొత్తగా కనిపిస్తారు. చైతూ నటనకు అందరూ పదింతలు క్లాప్స్ కొట్టారు. మేం ఎంతగా ఎగ్జైట్ అయ్యామో.. ప్రేక్షకులు కూడా అంతే ఎగ్జైట్ అవుతారు. ఈ సినిమాలో ప్రతీ ఎమోషన్ ఉంటుంది. నాగార్జున, నాగ చైతన్యకి సమానమైన సన్నివేశాలుంటాయి. ప్రేక్షకుల అంచనాలను మించేలా, వాళ్ళని మెప్పించేలా ఉంటుందనే ఈ సినిమాకి క్యాప్షన్ పండుగలాంటి సినిమా అని పెట్టాం. రమ్యకష్ణ, కతి శెట్టి అద్భుతంగా నటించారు' అని తెలిపారు.
నాయిక కతి శెట్టి మాట్లాడుతూ, 'నాగార్జున గారి ఎనర్జీని ఎవ్వరితోనూ మ్యాచ్ చేయలేం. ఆయన నిజంగానే కింగ్. చైతన్య గారితో పని చేయడం ఎంతో సులభం. సర్పంచ్‌గా నాగలక్ష్మీ పటాకాలా అనిపిస్తుంది. పాత్రను ఎంజారు చేస్తూ నటించాను. ఇది పండుగలాంటి సినిమా. సంక్రాంతి పండక్కే రావడం ఆనందంగా ఉంది' అని చెప్పారు.
''మనం', 'సోగ్గాడే చిన్ని నాయన' తరువాత చేస్తున్న మూడో చిత్రం. ఈ సినిమాకు ఛాన్స్ ఇచ్చినందుకు నాగార్జున గారికి థ్యాంక్స్. ఆయనతో పని చేసిన ప్రతీ సారి కొత్త అనుభూతికి లోనయ్యాను. నా ఫ్రెండ్ కళ్యాణ్ కష్ణ, నేను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. పాటలన్ని ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. సినిమా కూడా అందర్నీ కచ్చితంగా అలరిస్తుంది' అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. జీ అధినేత ప్రసాద్ మాట్లాడుతూ, 'ఈ సినిమా ఆఫర్ రావడం నిజంగానే బంగారం లాంటి సినిమా అనుకున్నాం. మేం అంతా ఈనెల 14 కోసం ఎదురుచూస్తున్నాం' అని చెప్పారు.
పండగలాంటి సినిమా అని ముందు నుంచి అంటూనే వస్తున్నాం. మా టీమ్ అంతా సంక్రాంతికి రావాలని నిర్ణయించుకున్నాం. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా కూడా జనవరి 14నే వచ్చి, పెద్ద హిట్ అయ్యింది. అన్ని పరిస్థితులు బాగుంటే ఈ సినిమా కూడా జనవరి 14నే రానుంది. సంక్రాంతికి కచ్చితంగా సందడి చేస్తాం. ఇందులో ఏదో సూపర్ పవర్ ఉంది. ఎంతో వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. అయినప్పటికీ నా టీం చేసిన కషి వల్లే ఈ రోజు విడుదల తేదీని ప్రకటిస్తున్నాం. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమాని బాగా తీశాం.
'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' పాన్ ఇండియన్ సినిమాలు. వాటిని ప్రపంచమంతా చూడాలి.
అవి పోస్ట్‌పోన్ అవ్వడం బాధగా ఉంది.
నా కెరీర్‌కు 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం',
'జానకి రాముడు' ఎలా ప్లస్ అయ్యాయో,
నాగ చైతన్యకు ఈ చిత్రం అలా ప్లస్ అవుతుంది.
- నాగార్జున