Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ. కాశీ తెరకెక్కిస్తున్న సినిమా 'చిత్తం మహారాణి'. లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలో జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'కోలకళ్ళ చిన్నది..' పాటను అగ్ర కథానాయిక రష్మిక మందన్న విడుదల చేశారు. రామ్ మిర్యాల ఆలపించిన ఈ పాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా విడుదల చేసిన పాటకి సైతం టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు' అని తెలిపారు.
తులసి, హర్షవర్ధన్, మధునందన్, సత్య, రాజ్ కుమార్ కాశిరెడ్డి, వైవా హర్ష, జబర్దస్త్ అశోక్, నాయని పావని తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.