Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్ స్టార్ కష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా 'హీరో'తో హీరోగా పరిచయం కాబోతోన్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గల్లా పద్మావతి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. 'కష్ణగారి 'పచ్చని సంసారం'లో అశోక్ చైౖల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. డాన్స్, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్, సెన్సాఫ్ హ్యూమర్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నీ అశోక్‌లో చాలా బాగున్నాయి. మాస్ హీరోకి ఉండే లక్షణాలన్నీ కూడా పుణిక ిపుచ్చుకున్నాడు. ఆదిత్య అద్భుతంగా తెరకెక్కించాడు. కాన్ఫిడెంట్‌గా సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. సంక్రాంతికి సినిమాలు లేవనే కొరతను తీర్చేందుకు ఈ సినిమా రాబోతోంది' అని అన్నారు. 'మా రెండేళ్ల నిరీక్షణకు ఇప్పుడు సరైన సమయం వచ్చింది. మా సినిమాకు ఈ సంక్రాంతి దొరికింది. కష్ణ గారు జనవరి 15న విడుదల చేయమని చెప్పేశారు. జనవరి 15న అశోక్‌ని, మా బ్యానర్‌ను పరిచయం చేయబోతోన్నాం. మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను' అని గల్లా జయదేవ్ తెలిపారు.
పద్మావతి గల్లా మాట్లాడుతూ, 'డిస్ట్రిబ్యూటర్లంతా సాయం చేస్తున్నారని మా బాబారు ఆదిశేషగిరి రావు చెప్పారు. మా అశోక్‌ను, అతని టాలెంట్‌ను అందరికీ చూపించబోతోన్నాం. సినిమాలో అశోక్‌ను చూస్తుంటే నాన్న గారే (కృష్ణ) ఎక్కువగా గుర్తొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే మహేష్ కనిపించాడు' అని అన్నారు. 'ఇలాంటి సినిమాకు, కంటెంట్‌కు సంక్రాంతి పర్ఫెక్ట్గా ఉంటుంది. సినిమా చాలా కలర్ఫుల్గా ఉంటుంది' అని డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెలిపారు.
హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ, 'నా కల నిజమవుతున్నట్టు అనిపిస్తోంది. సంక్రాంతికి రాబోతోన్నామని తెలిసినప్పటి నుంచి మా ఎనర్జీ వేరే లెవెల్‌కి వెళ్లింది. ఇందులోని పాటలకు తాతగారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, నార్మల్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేం ఎంత ఎంజారు చేస్తూ సినిమాను తీశామో, ఆడియెన్స్ కూడా అంతే ఎంజారు చేస్తే మా టార్గెట్ రీచ్ అయినట్టే' అని చెప్పారు.