Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నట్టి క్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రం 'వర్మ' (వీడు తేడా). ముస్కాన్, సుపూర్ణ మలాకర్ కథానాయికలు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి,, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈనెల 21న భారీగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నట్టి కరుణ తెలిపారు. దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, 'ఓ సాఫ్ట్వేర్ కుర్రాడి జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతూ, యదార్థ సంఘటనల ప్రేరణతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది' అని చెప్పారు.
'సమాజంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న వాస్తవిక సంఘటనల సమాహారమే ఈ చిత్రం. చక్కటి నటనకు మంచి స్కోప్‌తో పాటు అన్ని ఎమోషన్స్ నా పాత్రలో ఉండటం అదష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్‌కి బాగా హెల్ఫ్ అయ్యే సినిమా ఇది' అని హీరో నట్టి క్రాంతి అన్నారు.