Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై రూపొందిన చిత్రం 'వేయి శుభములు కలుగు నీకు'. శివాజీ రాజా తనయుడు విజరు రాజా ,. తమన్నా వ్యాస్ హీరో, హీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహా పటేల్, జామి శ్రీనివాస రావు సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా హీరో విజరు రాజా మాట్లాడుతూ, 'మేం ఊహించినట్టుగానే మా చిత్రానికి మంచి ఆదరణ లభించటం ఆనందంగా ఉంది. మా చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులూ బాగా కనెక్ట్ అవుతున్నారు. విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్టులు వస్తున్నాయి. నా కెరీర్‌కి ఈ సినిమా విజయం మంచి హెల్ఫ్ అవుతుంది' అని తెలిపారు.
'తండ్రీ కొడుకుల అనుబంధానికి ప్రతీకగా తెరకెక్కించిన పాటకు అందరూ ఫిదా అవుతున్నారు. సినిమా చాలా బాగుందంటూ అన్ని చోట్ల నుంచి ఫోన్లు రావడం చాలా హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్‌తో సినిమాలు తీస్తే కచ్చితంగా ఆదరిస్తామని ప్రేక్షకులు మరోమారు నిరూపించారు' అని దర్శక, నిర్మాతలు చెప్పారు.