Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫన్ ఫిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా బిజి గోవిందరాజు సమర్పణలో రూపొందుతున్న చిత్రం 'కొత్త కొత్తగా'. హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో ఎం. మురళీధర్ రెడ్డి నిర్మిస్తున్న భిన్న కాన్సెప్ట్ చిత్రమిది.
అజరు, విర్తి వఘాని,ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అగ్ర దర్శకుడు అనిల్‌రావిపూడి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు.
కాశీ విశ్వనాథ్, తులసి, కళ్యాణ్ నటరాజన్, పవన్ తేజ్, ఈ రోజుల్లో ఫేమ్ సాయి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, డీఓపి: వెంకట్, ఆర్ట్: సురేష్ భీమగాని, ఫైట్స్: పథ్వి శేఖర్
లిరిక్స్: కాసర్ల శ్యాం, అనంత శ్రీరామ్, కష్ణ చైతన్య, శ్రీమణి.