Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, నాగచైతన్య, రమ్యకష్ణ, కతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'బంగార్రాజు'. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ పతాకాలపై నాగార్జున నిర్మించారు. కళ్యాణ్ కష్ణ దర్శకుడు.
సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ శుక్రవారం మీడియాతో ముచ్చటించారు.
నాగ్ సర్ అందరికీ ముఖ్యంగా టెక్నికల్ టీమ్‌కు ఫ్రీడమ్ ఎక్కువగా ఇస్తారు. మా కాంబినేషన్లో మంచి మ్యూజిక్ రావడానికి ముఖ్య కారణమిదే. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉండే సినిమా. ఒక్క పాట కూడా వెస్ట్రన్ ఉండదు. అన్నీ కూడా ట్రెడిషనల్‌గా, పల్లెటూరి వాతావరణంలోనే ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో కూడా వెస్ట్రన్ ఇన్స్ట్రూమెంట్స్ని వాడలేదు. 'సోగ్గాడే చిన్ని నాయన'లోని ఫ్లేవర్‌ను ఇందులో కూడా కంటిన్యూ చేశాం.
'సోగ్గాడే చిన్ని నాయన'లో నాగ్ సర్ పాడిన పాట బాగా క్లిక్ అయింది. ఇందులో కూడా సిట్చ్యువేషన్ కుదరటంతో ఆయనతో పాడించాం.
ఇప్పటి వరకు విడుదలైన 'లడ్డుండా', 'నా కోసం', 'వాసివాడి తస్సాదియ్యా' పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇంకా మూడు పాటలున్నాయి. అవి కూడా అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటాయి.
సిధ్ శ్రీరామ్ గాడ్ గిఫ్టెడ్ సింగర్. ఇప్పటి వరకు తనతో మూడు పాటలు పాడించాను. అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆయన వాయిస్‌లో తెలియని సోల్ ఉంది.
ఇందులో కొన్ని డైలాగ్స్ మనసును తాకుతాయి. ఈ ఐదేళ్లలో కళ్యాణ్ కష్ణ ఆలోచన విధానం, మెచ్యూరిటీ ఎంతో పెరిగింది. ఇంత పెద్ద సినిమాను ఇంత తక్కువ సమయంలో తీశాడంటే ఎంత క్లారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది. 'సోగ్గాడే..' కంటే ఓ ముప్పై శాతం ఎక్కువే ఉంటుంది. పండుగకు థియేటర్లో చూసే సినిమాలా ఉంటుంది.
ప్రస్తుతం 'శేఖర్', విక్రమ్.కె. కుమార్‌తో చేస్తున్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలోనే చెబుతా. ఏ సినిమా చేసినా అందులోని పాటలు ప్రేక్షకుల్ని బాగా అలరించాలనే తపనతో చేస్తాను.
సీక్వెల్ సినిమాకి మ్యూజిక్ చేయడం కొంచెం కష్టమే.
'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో, అందరూ కచ్చితంగా పోలికలు పెడతారు. అందులో ఆ పాట అలా ఉంది. ఇందులో ఈ పాట ఇలా ఉందని అంటారు. ప్రేక్షకుల అంచనాలు అందుకోవాలంటే కనీసం ఒకటికి పది సార్లు ఆలోచించుకుని చేయాల్సి ఉంటుంది. మనకో బెంచ్ మార్క్ ఉంది. దాన్ని రీచ్ అవ్వాలని నాగ్ సర్ కూడా అంటుంటారు.