Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రత్యంగిరా దేవి ఆర్ట్స్ బ్యానర్‌పై నూతన నటీనటులు శాంతి మహారాజు, రఘురంజన్, ఆధ్య, కతిగౌడ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'చారు తో పూరి'. లవ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని పి.పవన్‌తో కలిసి దర్శకుడు విజరు కుమార్ ఉప్పర నిర్మించారు.
సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు విజరు కుమార్ ఉప్పర మాట్లాడుతూ, 'ఒక మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో చాలా మంది నూతన నటీనటులు ఇండిస్టీకి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు. కె.బి.ఈశ్వర్, బుల్ బుల్, పవన్ కుమార్, రాజేష్, నీలిమ, విమల, చంద్రశేఖర్, శ్రీకాంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రామ్ శ్రీనివాస్, సంగీతం: యేలేంద్ర, ఎడిటింగ్: సాయికుమార్ ఆకుల, ఫైట్స్: రవి, ఆర్ట్: మణి, కథ: అజరు, కో ప్రొడ్యూసర్: కె.బి. ఈశ్వర్ (బళ్ళారి).