Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్ స్టార్ కష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'హీరో'. నిధి అగర్వాల్ హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు.
సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఈనెల 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా శనివారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
చిన్నప్పటి నుంచి థియేటర్ ఆర్ట్స్ చేశాను. కాలేజ్‌లో నాకు ఫిల్మ్ డిగ్రీ ఉంది. ఏడేండ్ల వయసులోనే తాతగారి సినిమాలో నటించాను. అలాగే మహేష్‌గారి 'నాని' సినిమాలో కూడా యాక్ట్ చేశా. అప్పట్నుంచీ నాకు సినిమాల మీద మరింత ఇంట్రెస్ట్ కలిగింది. సింగపూర్‌లో థియేటర్ క్లాస్‌లు చేస్తున్నప్పుడు, అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యాను.
ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి.. హీరో అవ్వాలని అనుకుంటాడు. కాలేజ్‌లో ఉన్నప్పుడు మనమే తోపు అని అనుకునే క్యారెక్టర్. ఈ కథలో ఉన్న ట్విస్ట్లోనే ఈ సినిమా టైటిల్‌కు జస్టిఫికేషన్ ఉంటుంది. రిలీజయ్యాక ఈ సినిమాకు హీరో టైటిల్ పర్ఫెక్ట్ అని అంతా అంటారు.
శ్రీరామ్ ఆదిత్య గారిని నేను దర్శకుడిగా ఎంచుకోలేదు. మేం ఇద్దరం ఒకరినొకరు సెలెక్ట్ చేసుకున్నాం. ఆయన సినిమాలు, తెరకెక్కించే విధానం అన్నీ బాగుంటాయి. ఆయన చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేశాం.
ఈ సినిమాలోని కౌబారు గెటప్ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. ఇది నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ ఉండవు. కామెడీ, ఫైట్స్ ఎలా చేశానో.. ఎమోషనల్ సీన్స్‌లోనూ అలాగే నటించా. ఇందులో ఐదు పాటలుంటాయి. ప్రతీ ఒక్క పాటకు ప్రత్యేకమైన సందర్భం ఉంటుంది. మా దర్శకుడు శ్రీరామ్ ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దారు. ఈ సంక్రాంతికి పక్కా పండగ సినిమా ఇది. నిధిó అగర్వాల్ బాగా నటించింది.
సినిమా ఫస్ట్ కాపీ చూసి, నేను బాగా చేశానని మా అమ్మ, నాన్న చెప్పారు. ఓ డెబ్యూ హీరోకి ఇంతకంటే ఏం కావాలి?, అమ్మానాన్న మెచ్చుకోవడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యా. ప్రస్తుతం కథలు వింటున్నాను. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. అన్ని రకాల సినిమాలు, పాత్రలు చేయాలని అనుకుంటున్నాను.
కృష్ణ గారికి డేరింగ్ అండ్ డాషింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆయన్నుంచి అదే నేర్చుకున్నా. మహేష్ మామయ్య దగ్గరి నుంచి సెన్సాఫ్ హ్యూమర్, టాలెంట్, ఇంటెలిజెంట్, షార్ప్ నెస్ వంటి లక్షణాలను ఫాలో అయ్యా. ఇండిస్టీలోకి వస్తే ఎలా ఉండాలి?, ఎలా ధైర్యంగా ఉండాలి అని మహేష్ మావయ్య నాకెక్కువగా చెప్పారు.