Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోహిత్ కష్ణ, సంతోష్, నిఖిత, హర్షిత నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'పల్లె గూటికి పండగొచ్చింది'. కె. ప్రవీణ్ సమర్పణలో దివ్య తేజస్విని పతాకంపై తిరుమల్ రావు దర్శకత్వంలో కె.లక్ష్మి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ఆదివారం ఫిల్మ్ ఛాంబర్లో పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తిరుమల్ రావు మాట్లాడుతూ,'పల్లెల్లో ఉన్న యువత ఏ రకంగా చెడు మార్గంలో వెళ్తున్నారు?, మంచి ప్రవర్తనతో మంచి మార్గంలో వెళ్తే, ప్రభుత్వ సహకారం లేకుండానే ఎలా స్మార్ట్ విలేజ్ చేయవచ్చు అనేదే ఈ చిత్ర కథాంశం. రాజకీయ నాయకుల సహకారం, ప్రమేయం లేకుండా ఒక పల్లెను ఏ రకంగా అభివద్ధి పథంలో నడిపించవచ్చు అనే పాయింట్‌ని మంచి కాస్టింగ్‌తో చాలా బాగా చేశాం. క్లయిమాక్స్ ఎవ్వరూ ఊహించని రీతిలో ఉంటుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. 'ఈ సినిమాలో నేను యాక్ట్ చెయ్యలేదు. కానీ మా అబ్బాయి హీరోగా యాక్ట్ చేశాడు. సినిమా పూర్తి అయిన తర్వాత చూశా. దర్శకుడు నాకు ఏం చెప్పాడో దాని కన్నా బాగా తీశాడు. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఇది' అని నిర్మాత లక్ష్మీ తెలిపారు.
హీరో రోహిత్ కష్ణ మాట్లాడుతూ,'సీనియర్ నటీనటులతో నటించే ఇంత మంచి అవకాశం కల్పించిన తిరుమల్ రావుకు ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను శ్రీకాకుళంలో 95% చిత్రీకరణ చేశాం. తెలుగు భాషా సంస్కారం, పల్లెటూరి లైఫ్ ఎలా ఉంటుందని వివరంగా చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది' అని చెప్పారు.