Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్గా నటించిన చిత్రం 'అతిథి దేవో భవ'. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. రామ్ సత్యనారాయణ రెడ్డి సమర్ఫణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు.
ఈ చిత్రం ఈనెల 7న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. దీన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు చిత్ర బృందం ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, 'సినిమా విడుదలైన మొదటి షో నుంచి బాగుందని చాలా ఫోన్లు వచ్చాయి. ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారు. వైజాగ్, సీడెడ్లలో కలెక్షన్లు చాలా బాగున్నాయని రిపోర్ట్ వచ్చింది. ఇక నా నటనకు, అలాగే హీరోయిన్ నటనకు కూడా మంచి అప్లాజ్ వస్తోంది. పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. నా తల్లిగా నటించిన రోహిణికీ, మా మధ్య వచ్చిన సన్నివేశాలు హార్ట్ టచింగ్ ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ఇక సప్తగిరి కామెడీ ఎంటర్టైన్మెంట్లో మరో స్థాయిలో ఉంది. ఎక్కడా వినోదం మిస్ కాకుండా దర్శకుడు తీశాడు. యాక్షన్ ఎపిసోడ్ హైలైట్గా ఉందని టాక్ రావడం ఆనందంగా ఉంది. బయట కోవిడ్ వాతావరణ ఉన్నా ఇంత ఆదరణ పొందడం ఎంతో సంతృప్తినిచ్చింది' అని తెలిపారు.
'తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఇంతలా ఆదరిస్తున్నందుకు కతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వైజాగ్, సీడెడ్లో హాౌస్ఫుల్ కలెక్షన్లలో రన్ అవుతోంది. మిగిలిన అన్నీ చోట్ల కూడా బాగుందనే టాక్ ఉంది. సినిమా ఫస్టాఫ్లో ఎంటర్టైన్మెంట్, సెకండాఫ్లో మంచి ఎమోషన్స్ పండాయని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. సప్తగిరి పాత్ర హైలెట్గా నిలిచింది. హీరో, హీరోయిన్లతోపాటు రోహిణిగారి పాత్రని, సాంకేతిక సిబ్బంది పనితనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు' అని దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ, 'కోవిడ్ వల్ల బయట పరిస్థితులు బాగోలేకపోయినా మా తొలి ప్రయత్నాన్ని ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని అన్నారు.