Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నువ్వే నా ప్రేరణ.. నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నువ్వే నాకు సర్వస్వం... నువ్వే లేకపోతే.. ఈ రోజు నాలో సగం ఉండేది కాదు. నువ్వు నా కోసం చేసిన ప్రతీదానికీ ధన్యవాదాలు. విశ్రాంతి తీసుకో.. నాకే మరో జన్మంటూ ఉంటే.. మళ్ళీ నువ్వే నా అన్నయ్య కావాలని కోరుకుంటు న్నాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అన్నయ్య'.. అంటూ తన అన్నయ్య రమేష్‌బాబుతో తనకి ఉన్న అపారమైన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు చేసిన ఉద్వేగభరితమైన ట్వీట్ అందర్నీ కన్నీటి పర్యంతం చేస్తోంది.
కరోనా పాజిటివ్ ఉండటంతో కడసారి అన్నయ్యని చూడలేకపోయినందుకు మహేష్‌బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభిమాన నటుడి ఆవేదనకు, ఆ ఇంట నెలకొన్న విషాదానికి అభిమానులు సైతం కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదివారం అంత్యక్రియలను ఏర్పాటు చేస్తున్న తరుణంలో తనయుడి పార్థివ దేహాన్ని చూసి కృష్ణ చలించిపోయారు. కన్నీటీపర్యంతమవుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం రమేష్‌బాబు అంత్యక్రియలు ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో ముగిశాయి. గత కొంత కాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న రమేష్‌బాబు శనివారం సాయంత్రం కన్నుమూశారు. నటుడిగా, నిర్మాతగా రమేష్‌బాబు తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్నారు.