Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్లు అర్జున్
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'రౌడీ బార్సు'. దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి 'డేట్ నైట్..' సాంగ్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అగ్ర హీరో అల్లు అర్జున్ ఈ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ''డేట్ సాంగ్' చాలా బావుంది. 'రౌడీ బార్సు' టీమ్‌కి అభినందనలు. ఆశిష్ చాలా బాగా స్టెప్పులేశాడు. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది తెలుగు సినిమాలు గెలవాల్సిన తరుణం.. అన్నీ సినిమాలు సక్సెస్ కావాలి. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.
'నేను కాలేజ్‌లో చదువుకునేటప్పుడు ఫ్రెషర్స్ పార్టీ ఉండేది. అప్పుడు సమోసా.. కూల్ డ్రింక్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. దాన్ని బ్రేక్ చేద్దామని ఈ 'డేట్ నైట్' సాంగ్ ప్లాన్ చేశా. కచ్చితంగా ఈ పాట అందరికీ నచ్చుతుంది' అని డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి తెలిపారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు వచ్చిన పాటలు, ట్రైలర్ బాగున్నాయని అంటున్నారు. 'ప్రేమ దేశం', 'తొలి ప్రేమ', 'ఆర్య', 'హ్యాపీ డేస్'లా ఇదొక అవుట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ కంటెంట్‌తో చేసిన సినిమా ఇది. సంక్రాంతికి మా బ్యానర్ నుంచి 5 సినిమాలు వచ్చాయి. అన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలయ్యాయి. ఈ 14న వస్తున్న ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ అవుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. హీరో ఆశిష్ మాట్లాడుతూ, 'మా 'రౌడీ బార్సు' ఫస్ట్ లుక్‌ను సుకుమార్‌గారు, వినాయక్‌గారి సమక్షంలో విడుదల చేశాం. అలాగే ఎన్టీఆర్‌గారు మా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పుడు బన్నీ అన్న సాంగ్ రిలీజ్ కోసం వచ్చారు. బన్నీ అన్న గురించి నేను చెప్పేడంతవాడ్ని కాదు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాలేదు. ఎప్పుడో ఆయన పాన్ ఇడియా స్టార్ అయ్యాడు' అని చెప్పారు.