Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''హీరో' సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్ల నుంచి వచ్చే ఎమోషన్లే కథలో బలమైన పాయింట్. ముఖ్యంగా హీరోకి హీరోయిన్ నుంచే సమస్య వస్తుంది. అది ఏమిటి? అనేది చిత్ర కథ' అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పారు.
లేటెస్ట్‌గా ఆయన గల్లా అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'హీరో' చిత్రాన్ని రూపొందించారు. సూపర్‌స్టార్ కష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడే అశోక్ గల్లా. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు.
సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఈనెల 15న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సోమవారం మీడియాతో మాట్లాడుతూ,'నా దగ్గరున్న కథకు అశోక్ కరెక్ట్‌గా సరిపోతాడని భావించి, ఆయనతో ఈ సినిమా చేశా. టైటిల్ పరంగా చెప్పాలంటే హీరో అవ్వాలనుకునే కుర్రాడి కథ. చాలా మంది ఏదో సందర్భంలో హీరో అవ్వాలనుకుంటారు. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన పాయింటే. అయితే ఇది నా అనుభవంతో తీసిన కథ కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళని, పరిస్థితుల్ని స్టడీ చేసి రాసుకున్న కథ ఇది. ఈ సినిమా ఆసాంతం బోర్ కొట్టించకుండా పక్కా కమర్షియల్ అంశాలతో తీశాం. చూసిన ప్రేక్షకుడు రెండు గంటలు నవ్వుకుంటూనే ఉంటారు. అంతేకాదు అశోక్‌ను కొత్త హీరోగా చూశామనే ఫీలింగ్ కూడా కలగదు. కౌబారు సినిమా చేయాలనేది ఎప్పటినుంచో నా డ్రీమ్. కౌబారు సినిమాలంటేనే సూపర్ స్టార్ కష్ణ, మహేష్‌బాబు గుర్తొస్తారు. ఈ సినిమాలో మొదటి పది నిముషాలు అస్సలు మిస్ కావద్దు. ఈ సినిమాలో ఉన్న మెయిన్ ఛాలెంజింగ్ ఏంటంటే, ప్రయోగంతోపాటు వాణిజ్యాంశాలు కూడా ఉండేలా చేయడమే. నిధి అగర్వాల్ చాలా ఫ్రొఫెషనల్‌గా నటించింది' అని చెప్పారు.
నేను చేసిన 'భలేమంచి రోజు' చిత్రాన్ని కృష్ణగారు చూసి, మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాని కూడా చూసి, చాలా బాగా తీశావన్నారు. ఆయన అభినందన నాకెంతో సంతృప్తినిచ్చింది. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సంక్రాంతికి నూటికి నూరు శాతం మంచి వినోదాన్ని అందించే పక్కా ఎంటర్‌టైనర్.