Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరికొత్త కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న జీ తెలుగు రాబోయే సంక్రాంతికి మరిన్ని వినూత్న ప్రోగ్రామ్స్‌తో అలరించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు జీ తెలుగు తొలిసారి గాడ్స్ ఓన్ కంట్రీగా గుర్తింపు పొందిన కేరళ సౌందర్యాన్ని, సంక్రాంతి వేడుకల కలబోతగా చూపించనుంది.
'ఈనెల 13 ఉదయం 9 గంటలకు 'కేరళలో సంక్రాంతి అల్లుళ్ల సందడి' పేరుతో సంక్రాంతి ప్రత్యేకత, ఈ పండుగను మన వాళ్ళు ఎంత గొప్పగా చేసుకుంటారనేది 3 గంటల పాటు చూపించబోతున్నార. యాంకర్ సుమ కనకాల సారధ్యం వహించిన ఈ వేడుకల్లో ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించే ఈవెంట్లు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అభిమాన తారలందరూ పాల్గొన్న ప్రసిద్ధ 'వల్లం కళి' (బోట్ రేస్) హైలెట్‌గా నిలుస్తుంది. ఇక ఈనెల 14వ తేదీ ఉదయం 9 గంటలకు 'బంగార్రాజు' టీం నాగార్జున, నాగ చైతన్య, కతి శెట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా, వారికి మరింత ఉత్సహాన్ని అందించేలా చేసిన 'బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు' ప్రోగ్రామ్ మూడు గంటల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. 13,14 తేదీల్లో రెండు భాగాలుగా ప్రసారం అయ్యే ఈ వేడుకలు ప్రేక్షకుల్ని కచ్చితంగా మెప్పిస్తాయి' అని జీ తెలుగు బృందం తెలిపింది.