Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం 'రియల్ దండు పాళ్యం'. రామ్ ధన్ మీడియా వర్క్స్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి, రామ్ధన్ మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న వరల్డ్ వైడ్‌గా రామ్ధన్ మీడియా వర్క్స్ రిలీజ్ చేస్తోంది.
ఈ సందర్భంగా మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ట్రైలర్‌ని లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా రామ్ ధన్ మీడియా వర్క్స్ అధినేత వాల్మీకి మాట్లాడుతూ, 'తెలుగు, కన్నడ భాషల్లో 'దండుపాళ్యం' సిరీస్ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటినీ మించేలా 'రియల్ దండుపాళ్యం' ఉండబోతోంది. మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. ప్రతి సన్నివేశాన్ని ఎంతో రియలిస్టిక్‌గా దర్శకుడు మహేష్ తెరకెక్కించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. ఈ నెల 21న సినిమాను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం' అని చెప్పారు.
'మా చిత్రం నచ్చి రామ్ థన్ మీడియా వర్స్క్ వారు వరల్డ్ వైడ్‌గా సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. రియల్ ఇన్సిడెంట్స్కు దగ్గరగా మా సినిమా ఉంటుంది' అని నిర్మాత సి.పుట్టస్వామి అన్నారు. దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్ : కోయల్ బంజార.