Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రతి సినిమాకి నేను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. దర్శకులు అనుకున్న పాత్రలకు నావంతు న్యాయం చేస్తున్నా. గ్లామర్ పాత్రలతోపాటు నటనకు స్కోప్ ఉన్న ఏ పాత్రలోనైనా నటిస్తాను' అని నాయిక నిధి అగర్వాల్ చెప్పారు. అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన సినిమా 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా నాయిక నిధి అగర్వాల్ మంగళవారం మీడియాతో ఈ సినిమా గురించి పలు విశేషాలను షేర్ చేసుకుంది.
'ఇస్మార్ట్ శంకర్'లో డాక్టర్‌గా చేశాను. ఇందులోనూ అలాంటి పాత్రే. కానీ తేడా ఉంటుంది. నా పేరు సుబ్బు. నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
నా ఫాదర్‌గా జగపతిబాబు, హీరో తండ్రిగా నరేష్ గారు నటించారు. రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇది. సందర్భానుసారంగా వచ్చే కామెడీ నవ్విస్తే, కథలో కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని భలే థ్రిల్ చేస్తాయి.
గల్లా అశోక్ కొత్త హీరో అయినప్పటికీ నాకు ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే తను అన్నింటిలోనూ చాలా ఫర్‌ఫెక్ట్‌గా చేశాడు. పక్కా కమర్షియల్ హీరో అవుతారు.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యగారికి చాలా క్లారిటీ ఉంది. ఆయన ఏం చెప్పాలనుకున్నారో, పాత్రల్ని ఎలా చూపించాలనుకున్నారో వాటిని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించగలరు. ఈ సినిమా మేకింగ్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. ముఖ్యంగా పద్మగారు నన్నెంతో బాగా చూసుకున్నారు.
'హరి హర వీరమల్లు' చిత్రంలో పవన్ కళ్యాణ్‌గారితో నటించటం అదష్టంగా భావిస్తున్నా. నాకు యాక్షన్ పాత్రలంటే ఇష్టం. ఇందులో నాకు కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. వాటిని చాలా ఇష్టంగా చేశా. పవర్‌స్టార్ చాలా కూల్‌గా ఉంటారు. ఆయన సినిమాలో నాకు బెస్ట్ రోల్ దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఛాన్స్ వస్తే ఆయనతో మళ్ళీ యాక్ట్ చేస్తా.
ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఓ సినిమా చేశాను. మరో తమిళ సినిమాకి గ్రీన్‌సిగల్ ఇవ్వబోతున్నా. అలాగే ఏప్రిల్‌లో ఓ హిందీ సినిమా స్టార్ట్ అవుతుంది.