Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం 'ఆద్య'. శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, వింటేజ్ పిక్చర్స్ బ్యానర్స్ పై పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జి, వైజాగ్), ఎస్.రజినీకాంత్ నిర్మిస్తున్నారు. డి.ఎస్.కె. స్క్రీన్ సమర్పణలో ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచి ఆరంభమైంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ బేనర్ పై బాబ్జి నిర్మించిన తొలి చిత్రం 'షికారు' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే బ్యానర్‌లో ఆయన నిర్మిస్తున్న మలి చిత్రం 'ఆద్య'. వినూత్న కథాకథనాలతో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కనుంది' అని చెప్పారు.
విశ్వ కార్తీక్, హేబా పటేల్, కన్నడ కిషోర్, అమితా రంగనాధన్, రాజా రవీంద్ర, సూర్య తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: పి. సాయి పవన్ కుమార్, కెమెరా : డి.సివేంద్ర, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్.