Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, నాగచైతన్య, రమ్యకష్ణ, కతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'బంగార్రాజు'. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ పతాకాలపై నాగార్జున నిర్మించారు. కళ్యాణ్ కష్ణ దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నాయిక కతిశెట్టి మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
విన్నప్పుడే నవ్వేశా..
'బంగార్రాజు'లో నా క్యారెక్టర్ వినగానే నవ్వేశాను. తెలివైన అమాయకురాలిగా నటించా. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా కచ్చితంగా నవ్వుతారనే నమ్మకంతో ఈ పాత్ర చేయడానికి అంగీకరించా.
ఒక్క మాటలో చెప్పాలంటే నా పాత్ర ఫన్ పటాకాలా ఉంటుంది. గ్రామ సర్పంచ్‌గా చేశాను. ఇది కొత్తగా అనిపించింది. సర్పంచ్ స్పీచ్‌ల వల్ల కొత్త తెలుగు పదాలు తెలుసుకున్నా.
ఆశ్చర్యపోయా..
నాగ్ సార్‌తో సినిమా అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనిపించింది. కానీ ఆయన్ని కలిశాక తోటి నటులకు ఆయన ఇచ్చే గౌరవం, హుందా తనం చూసి ఆశ్చర్యపోయా. నేను జూనియర్ అని కాకుండా టీమ్మేట్లా చూశారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా చూశా. అందుకే ఈ సినిమా చేసేటప్పుడు ఒత్తిడి అనిపించలేదు. ఈ సినిమాలో ఒక ఫోక్ సాంగ్ చేశాను. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేక్షకుల కోసం బాగా చేయాలనే ఫీల్‌తో ఎంజారు చేస్తూ డాన్స్ చేశా.
నాలుగు పాత్రలూ చాలా కీలకం
ఇందులో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. చిన్న బంగార్రాజు, పెద్ద బంగార్రాజు, సత్యభామ, నాగలక్ష్మీ అనే నాలుగు పాత్రలు సినిమాకి నాలుగు స్తంభాలాంటివని దర్శకుడు కళ్యాణ్‌గారు కథ నెరేట్ చేసినప్పుడే చెప్పారు. నేను ఇప్పటివరకు ఆరు పాత్రలు చేశాను. వేటికవే భిన్నమైనవి. ఆరంభంలోనే నాకు ఇలాంటివి రావడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. సైకాలజీ స్టూడెంట్‌గా నేను అందరినీ గమనిస్తుంటాను. నాగ్ సార్లో నేను అబ్జ్వర్వ్ చేసింది ఏంటంటే, షాట్ లేనప్పుడు చాలా క్లాసీగా మాట్లాడతారు. షాట్ రెడీ అనగానే వెంటనే పాత్రలో లీనమైపోతారు. అది చాలా గ్రేట్. అలాగే రమ్యకష్ణగారి నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మాచర్ల నియోజకవర్గం', రామ్‌తో మరో సినిమా ఉన్నాయి. లేడీ ఓరియెంటెండ్ కథ విన్నాను. అది ఇంకా ఫైనల్ కాలేదు.