Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి 'రావణాసుర' అనే టైటిల్‌ని ఖరారు చేసిన విషయం విదితమే. రవితేజ నటిస్తున్న 70వ చిత్రమిది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ అనే ముఖ్య పాత్రలో సుశాంత్ నటిస్తున్నట్టు చిత్ర బృందం మంగళవారం అధికారికంగా తెలియజేస్తూ, ఆయన లుక్ పోస్టర్ని రిలీజ్ చేసింది.
''అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రమిది. 'రావణాసుర' కథతోపాటు తన పాత్ర నచ్చి ఆయన వెంటనే గ్రీన్‌సిగల్ ఇచ్చారు. సుశాంత్ అప్పియరెన్స్ ఈ చిత్రానికి బోనస్ కానుంది. నీలిరంగు కళ్లతో, పొడవాటి జుట్టుతో, స్టైలీష్ లుక్‌తో ఉన్న సుశాంత్ పోస్టర్ అందర్నీ అలరిస్తోంది. హీరోలు లేరు అనే క్యాప్షన్‌తో ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. లాయర్‌గా రవితేజ నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. అలాగే ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ చేస్తారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ అందించారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.